గట్టుప్పల్, జనవరి 14 : గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామానికి ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన ఐమాక్స్ లైట్లను సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, ఉప సర్పంచ్ శారద జబ్బర్ లాల్ ఆధ్వర్యంలో బుధవారం ఫిటింగ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి పలు రకాలుగా సేవలు అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్‌కు తుల్జా భవాని మాత ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు. గ్రామానికి అడగ్గానే లైట్లు పంపించిన ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్‌కు, డైరెక్టర్ అశోక్ కు గ్రామ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఐతరాజు హనుమంతు, దండిగా శంకర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.