మిర్యాలగూడ, డిసెంబర్ 31: నాటుసారా, బెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దామరచర్ల మండలం కొండ్రపోల్, మిర్యాలగూడ మం డలం ఐలాపురం గ్రామ శివారులో ఎక్సైజ్ పోలీసులు రూట్ వాచ్ చేస్తుండగా 110 కిలోల బెల్లం, 25 లీటర్ల నాటుసారాను ఓమ్ని మారుతి వాహనంలో తరలిస్తుండగా గమనించి పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. వాహనంతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని, వాచ్యాతండాకు చెందిన లావూరి బాలకోటి, దామరచర్లకు చెందిన ఎండీ.రెహమాన్, మిర్యాలగూడకు చెందిన మహంకాళి రామలు, పెద్దదేవులపల్లికి చెందిన బలిగ శ్రీను, ఐలాపురానికి చెందిన నునావత్ రమేశ్‌ను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన నారాయణను మిర్యాలగూడలో అదుపులోకి తీసుకోగా అతని వద్ద 19 ఫుల్‌బాటిళ్లు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రవీణ్ వద్ద 12 ఫుల్ బాటిళ్లు మొత్తం 31 బాటిళ్ల డిఫెన్స్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు మద్యం అమ్మగా వచ్చిన రూ.12వేలను కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు రాఘవేందర్‌రెడ్డి, ఎస్కే.పర్వీన్, వై.లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.