అర్వపల్లి, సెప్టెంబర్ 08 : ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చావు డప్పు పిలుపును అడ్డుకోవడానికి మద్దతుగా బయల్దేరిన జాజిరెడ్డిగూడెం బీఆర్ఎస్ సర్పంచులను అరెస్టు చేయడం దారుణమని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వల్లపు గంగయ్య అన్నారు. మంగళవారం శాంతియుతంగా వెళ్తున్న బీఆర్ఎస్ సర్పంచులను సిద్దిపేట జిల్లా బేగంపేట పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిలో సర్పంచులు బొడ్డు ఇందిరా సోమరాజు, మేడి వీరస్వామి, అంకిరెడ్డి వీరాంజనేయులు, కేలోతు కాంతమ్మ హరిలాల్, కలకోట్ల శైలేందర్, బానోతు సైదులు, నున్న యాదగిరి పాల్గొన్నారు.