నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 08 : ఓటర్ లిస్ట్‌లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కనగల్ ఎంపీడీఓ సుమలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. ఓటరు జాబితాలో ఏవైనా అవకతవకలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, రమేశ్, భిక్షం పాల్గొన్నారు.