పెన్‌పహాడ్, ఏప్రిల్ 10 : పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే అంగోతు యాదగిరి అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతిచెందాడు. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన గత మూడు సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నల్లగొండలోని ఆరోగ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం చనిపోయాడు. సూర్యాపేటలోని నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజేశేఖర్, ఎస్ఐ కాస్తల గోపికృష్ణ, పోలీస్ సిబ్బంది సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.