నకిరేకల్, జూన్ 16 : సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఆయనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నిర్వహించిన నకిరేకల్, చిట్యాలలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించిన బ్రోచర్లు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందీ తెలంగాణ రాష్ట్ర కోసమైతే నేడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరింది నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని తెలిపారు. మున్సిపాలిటీలో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు పరిష్కారమయ్యాయని అన్నారు. శివనేనిగూడెం కూడా దాదాపు 80 శాతం సీసీ రోడ్లు పూర్తి చేసినట్లు వివరించారు. చిట్యాలలో అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. మున్సిపల్ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి అధ్యక్షతన కార్యక్రమంలో ప్రత్యేకాధికారి బి.శైలజ, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, కమిషనర్ రాందుర్గారెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండే సైదులు, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, జమాండ్ల జయమ్మ, పందిరి గీత, జిట్ట పద్మ, బెల్లి సత్తయ్య, జమీరోద్దిన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, గ్రంథాలయ చైర్మన్ దాసరి నర్సింహ, వనమా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రూ.90 కోట్లతో నకిరేకల్ అభివృద్ధి
నకిరేకల్ : రూ.90 కోట్లతో నకిరేకల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ముందుగా ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్క రించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని, ప్రజలను ఇబ్బంది పెట్టె పనులు ఎప్పటికీ చేయలేదన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ.26 కోట్లతో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామన్నారు. అనంతరం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు. మున్సిపల్ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేశ్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, కమిషనర్ నల్లాబాలాజీ, తాసీల్దార్ ప్రసాద్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండ ల, పట్టణాధ్యక్షులు నవీన్‌రావు, సైదిరెడ్డి, నాయకులు సామ శ్రీనివాస్‌రెడ్డి, పెండెం సదానందం, సోమ యాదగిరి, పరమేశం, గణేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచి
చండూరు : సీఎం కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా మారిందని కల్లు గీత కార్పొరేషన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. స్థానిక భవాని ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చండూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం రూ.58 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. అంతకు ముందు కోలాట బృందాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అనంతరం జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డి మాట్లాడుతూ చండూరు మున్సిపాలిటీగా మారిన తరువాత ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశుధ్యంలో మెరుగు పడిందన్నారు. ప్రతిభ కనబరిచి బెస్ట్ పాస్ట్ మూవింగ్ సిటీ అవార్డు అందుకోవడం గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా పట్టణ మహిళా సంఘాలకు రూ. కోటి యాబై లక్షల యాబై వేలు రుణాలను అందజేశారు. అలాగే 11 మంది చిరు వ్యాపారులకు మంజూరైన రూ.8 లక్షల రుణాలను అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ ఎండీ ఖాజా మెయినోద్దీన్, వైస్ చైర్మన్ దోటి సుజాతావెంకటేశ్, కౌన్సిలర్లు కోడి వెంకన్న, మంచుకొండ కీర్తీసంజయ్, అన్నెపర్తి శేఖర్, అనంత మంగమ్మా గిరిధర్, కొన్ర్రెడ్డి యాదయ్య, గుంటి వెంకటేశం, కోఆప్షన్ సభ్యులు సంకోజు దుర్గమ్మ, ముజాయిద్దిన్, వహిద్ పాల్గొన్నారు.