– మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
– దేవరకొండలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు
దేవరకొండ, జూన్ 03 : నిబద్ధతకు నిదర్శనం, నిస్వార్థ సేవకు చిరునామా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ దేవరకొండ పార్టీ కార్యాలయంలో హరీశ్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడు హరీశ్‌రావు ఆయురారోగ్యాలు, అష్టెశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కేతావత్ భిల్యా నాయక్, కౌన్సిలర్లు వీరమోని అంజిగౌడ్, కేతవత్ రుప్లా నాయక్, పొట్ట మురళి, పొట్ట మదు, ముత్యాల రవికుమార్, పులిజాల భవాని జాని, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, సర్పంచులు రమావత్ తులసిరామ్, ఆడారపు హరికృష్ణ, రమావత్ కిషన్ నాయక్, గాజులు రాజేశ్, జానీబాబా, చింతపల్లి మైనార్టీ నాయకులు ఖలీద్, మకాం చంద్రమౌళి, మాడెం రాములు యాదవ్, నల్లగాసు సత్యనారాయణ, ఇలియాస్ పటేల్, ఎస్కే జమీర్ బాబా, తరి గోవర్థన్, అందుగుల సైదులు, పగిడిమర్రి సతీష్, వడత్య గణేష్, జైపాల్ నాయక్, కొర్ర రాజేష్, నాగార్జున, బత్తుల ఆంజనేయులు, గుండాల శివ, జగదీష్ పాల్గొన్నారు.