చిట్యాల, అక్టోబర్ 2 : భావితరాలు గాంధీ మార్గాన్ని అనుసరించి శాంతియుత మార్గంలో పయనించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలోని గాంధీ గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీనే నిజమైన దేవుడని గాంధీజీ ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యం వల్ల దేశంలో సామాన్యుడు కూడా అత్యున్నత స్థాయి వరకు ప్రజాస్వామ్య పద్ధ్దతిలో ఎదగవచ్చన్నారు. తాను కూడా ఆ మార్గంలోనే పంచాయతీ సభ్యుడు నుంచి పార్లమెంట్ సభ్యుడి ఎదగానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ గుడి నిర్వాహకులు సుఖేందర్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మహాత్మా చారిటబుల్ ట్రస్టు గౌర వ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, మహిళా విభాగం అధ్యక్షురాలు పందిరి గీత, మండలాధ్యక్షుడు తేరట్పల్లి హనుమంతు, వాసవీ క్లబ్, వనితా క్లబ్ బాధ్యులు ప్రొద్దుటూరు శ్రీనివాస్, మేడిశెట్టి ఉమాశంకర్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, వనమా హేమ, వనమా మౌనిక, పోలా సరిత, రంగా వెంకటేశ్వర్లు, వీలా సత్యనారాయణ, వనం నవీన్, మిర్యాల జగతయ్య పాల్గొన్నారు.