సూర్యాపేట టౌన్, మే 20 : బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుర్రం సత్యనారాయణ రెడ్డి తన జన్మదిన వేడుకలను మంగళవారం అనాథలు, మానసిక వికలాంగుల మధ్య జరుపుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని ఆలేటి ఆటం వరల్డ్ లో మానసిక వికలాంగులు, అనాథల మధ్య కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ.. అన్నా అంటే నేనున్నా అంటూ కొండంత భరోసానిచ్చే నాయకుడు గుర్రం సత్యనారాయణ రెడ్డి అని కొనియాడారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున కేక్ లు కట్ చేసి శాలువ, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మట్టికుంట్ల చింటూ, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, అన్నపూర్ణపు నరేందర్, యువకులు నాని, రవితేజ, షరీఫ్, రాజేశ్, శరత్, వంశీ, మహేశ్, మణికంఠ, రియాజ్, హర్ష, శంకర్ పాల్గొన్నారు.