రామగిరి, జూన్ 8 : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం జరుగనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 16,899 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. నల్లగొండ జిల్లా కేంద్రంలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా.. 10గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను జిల్లా అధికారులతోపాటు ప్రత్యేక రూట్ అధికారులు, డిపార్టుమెంట్ అధికారులు, పరిశీలకులు పర్యవేక్షణ చేశారు. ఎక్కడా తప్పులు జరుగకుండా అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఇచ్చిన నిబంధనలు విధిగా చదివి రావాల్సి ఉంటుందని తెలిపారు.