నల్లగొండ, ఆగస్టు 28 : సంతోషిమాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చనలు, వడిబియ్యాలు, హోమం తదితర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానానికి కందుల నిర్మలమ్మ, బాలరాజు–అనురాధ, వెంకటరమణ–భార్గవి, శ్రీనివాస్–వాణి, తేజస్విని గౌడ్ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ పుష్పలత–వెంకన్న యాదవ్, సహాయ కమిషనర్ కె.భాస్కర్, పరిశీలకురాలు బి.సుమతి, ఈఓ జల్లేపల్లి జయరామయ్య, ఆలయ పూజారి మోహన్ శర్మ పాల్గొన్నారు.