తుంగతుర్తి, నవంబర్ 04 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం అశోక్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలప్రగడ కిషన్ రావు, దొనకొండ రమేశ్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.