అర్వపల్లి, మే 21 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ రాంబాబు నిర్వాహకులకు సూచించారు. బుధవారం అర్వపల్లి మండలంలోని అర్వపల్లి, రామన్నగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. లారీలు వెంటవెంటనే సెంటర్లకు పంపిస్తున్నామని, హమాలీ కొరత లేకుండా చూసి వెంటనే లోడింగ్ చేయించాలని మిల్లర్లకు సూచించారు. అదేవిధంగా రైతులు తమ సొంత ట్రాక్టర్లు గానీ లేదా కిరాయి ట్రాక్టర్ల ద్వారా గానీ ధాన్యం రవాణా చేసుకోవచ్చని, ట్రాక్టర్ కిరాయి టన్నుకు రూ.300 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున తొందరగా లిఫ్ట్ చేయాలని కోరారు. ఆయన వెంట డిప్యూటీ తాసీల్దార్, ఆర్ఐ ఉన్నారు.