నిడమనూరు, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని కోరారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మునికృష్ణయ్య, ఏపీఎం నరహరి, నాయకులు కొండ శ్రీనివాస్ రెడ్డి, మేరెడ్డి వెంకటరమణ, ఆలంపల్లి మైసయ్య, కంచి పాపయ్య, గుదెగోపు లక్ష్మారెడ్డి, భాస్కరి నారాయణ, సీసీలు నరసింహ చారి, తంగమణి పాల్గొన్నారు.