రామగిరి, డిసెంబర్ 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 మంగళవారం నల్లగొండ పట్టణంలో ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులు హాజరై వివిధ క్రీడాల్లో తలపడ్డారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ్మరావు, జిల్లా యూత్ అండ్ స్పోర్స్ అధికారి (డీఎస్ఈవో) ఎండీ.అక్బర్ అలీ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. పోటీలు భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాకారులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోటీల్లో భాగంగా అథ్లెటిక్స్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటిన్, తదితర క్రీడా పోటీలు హోదా హోరీగా సాగాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఐలయ్య, సత్తయ్య, పీడీ ప్రసాద్, సైదులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు మాధురి, అంజయ్య, జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Ramagiri : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభం

Ramagiri : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభం