నాణ్యతపై నజర్
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆహార శాఖ యంత్రాంగం వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వసతి గృహాల్లో తనిఖీలు చేసి ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పూర్తి చేసిన అధికారులు, ఇక వరుసగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలతో పాటు గురుకులాలకు వెళ్లనున్నారు
- హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారమే లక్ష్యం
- గురుకులాలతోపాటు సంక్షేమ వసతి గృహాలపై నిఘా
- సర్కారు ఆదేశాలతో ఫుడ్ ఇన్ స్పెక్టర్ల తనిఖీలు
- నాణ్యత లేకుంటే కలెక్టర్కు నివేదిక.. ఆపై చర్యలు
- ఉమ్మడి జిల్లాలో వారం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆహార శాఖ యంత్రాంగం వారం రోజుల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వసతి గృహాల్లో తనిఖీలు చేసి ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పూర్తి చేసిన అధికారులు, ఇక వరుసగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలతో పాటు గురుకులాలకు వెళ్లనున్నారు. నాణ్యత పాటించని కాంట్రాక్ట్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 504 వసతి గృహాలు ఉండగా, 1.25లక్షల మంది విద్యార్థులు వాటిల్లో ఉండి చదువుకుంటున్నారు. సర్కారు నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వసతి గృహాలు..
గురుకులాలు 84
కస్తూర్బా, మోడల్ స్కూల్ 140
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 280
నల్లగొండ, ఆగస్టు 3 : అసలే వానకాలం.. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం.. ఈ సమయంలో ఆహారంలో నాణ్యత లేకుంటే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని సంక్షేమ వసతి గృహాలతో పాటు గురుకుల వసతి గృహాలను తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. ప్రతి రోజూ ఆయా వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని పరిశీలించడంతోపాటు అందులో ఎంత నాణ్యత ఉన్నదనేది చూసి కలెక్టర్లకు నివేదించాలని సూచించింది. దీంతో జిల్లా ఆహార శాఖ యంత్రాంగం గత నెల 27 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు 35 సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను తనిఖీ చేసిన యంత్రాంగం ఇక వరుసగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలతోపాటు గురుకుల హాస్టళ్లను తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించనున్నది.
లోపాలుంటే చర్యలు
జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలతోపాటు కళాశాల వసతి గృహాలు, కస్తూర్బా, మోడల్, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్నారు. కొన్ని వసతి గృహాల్లో ఎక్కువ మంది ఉండగా మరికొన్ని వసతి గృహాల్లో తక్కువగా ఉన్నారు. ఎక్కువ మంది ఉన్న వాటిల్లో కొంత శుభ్రత లోపించే అవకాశం ఉండటం సహజం. ఆహారం నాణ్యత లేకుంటే విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నాణ్యంగా ఆహారం అందించాలని ప్రభుత్వం ఆయా కాంట్రాక్టు సంస్థలను ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టు సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది.
ఉమ్మడి జిల్లాలో 500కు పైగా వసతి గృహాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గురుకుల హాస్టళ్లు 84, కస్తూర్బా, మోడల్ వసతి గృహాలు 140 ఉన్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు 280 ఉన్నాయి. ఆయా వసతి గృహాల్లో మొత్తం 1.25 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. సంక్షేమ వసతి గృహాల్లో కొన్ని ప్రీ మెట్రిక్ మరికొన్ని పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో భోజనం, వసతిపై యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా గురుకుల విద్యాసంస్థల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50వేల మందికిపైగా విద్యార్థులు ఉండగా వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది.
కలెక్టర్కు నివేదిస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశానుసారం ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 35 వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టాం. వర్షాకాలం కాబట్టి కాస్త శుభ్రత లోపించింది తప్ప ఆహార నాణ్యతలో ఇబ్బంది లేదు. వంట చేసే వారిని గ్లౌజులు వేసుకొని వంట చేయాలని చెప్పాం. కొన్ని ప్రాంతాల్లో బియ్యం నాణ్యత లోపిస్తే వెనక్కి పంపించాలని ప్రిన్సిపాళ్లకు సూచించాం. ఆహారంలో నాణ్యత పాటించక పోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దీనిపై వెంటనే కలెక్టర్కు నివేదించాలని ప్రభుత్వం సూచించడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– స్వాతి, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా
నాణ్యత లేకుంటే వెనక్కి పంపిస్తున్నాం..
వసతి గృహాలకు వచ్చే బియ్యంతోపాటు కూరగాయలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించాం. నేను కూడా రెగ్యులర్గా ఏదో ఒక గురుకుల వసతి గృహాన్ని సందర్శిస్తున్నా. బియ్యం నాణ్యంగా లేకపోతే వెంటనే వెనక్కి పంపిస్తున్నాం. కూరగాయలు కూడా తాజాగా ఉండేవే తీసుకొచ్చి వడ్డించే ఏర్పాటు చేస్తున్నాం.
– విష్ణుమూర్తి గౌడ్, మైనార్టీ ఆర్సీఓ, నల్లగొండ
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి
ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో అన్ని వసతి గృహాల్లో శుభ్రతను పాటించాలి. నాణ్యమైన భోజనం అందజేయకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం గురుకుల విద్యార్థులపై ఏటా ఒక్కొక్కరికి రూ.1.25లక్షలు వెచ్చించి నాణ్యమైన విద్యతోపాటు వసతి కల్పిస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టు సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయాలి. మెనూను తప్పనిసరిగా పాటించాలి.
– నారబోయిన స్వరూపారాణి, నల్లగొండ జడ్పీ సాంఘిక స్థాయీ సంఘం చైర్పర్సన్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- govt
- hostel food
- inspect
- schools
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

