తిరుమలగిరి : వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట ( Suryapeta ) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ ( Gadari Kishore Kumar ) ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.
తుంగతుర్తి నియోజకవర్గానికి గతంలో కాళేశ్వరం ద్వారా అందించిన నీళ్లు ప్రస్తుతం కనిపిం చడం లేదని, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పంటలు పొట్ట దశలో ఉన్నయని, ఈ సమయంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉందని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే ఉత్పత్తి చేయడం లేదని కిషోర్‌కుమార్ ఆరోపించారు. 50 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ రేవంత్‌రెడ్డిని వదిలేది లేదని , అన్ని కక్కిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగలడం ఖాయమని, రైతుల ఉసురుతో ప్రభుత్వం నాశనం తప్పదని వెల్లడించారు.