HomeNalgondaGongidi Mahender Reddy Says That The Congress Govt Has Completely Flopped In Implementing Its Promises
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
కోమటిరెడ్డి ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్నా రోడ్లు వేయలేని దుస్థితి
బీర్ల ఐలయ్యకు భూ దందాలపై ఉన్న మక్కువ అభివృద్ధిపై లేదు
రైతులను ఆదుకునేందుకు లేని డబ్బులు.. అందాల పోటీలకు ఎలా వచ్చాయి?
డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
గుండాల, మే 11 : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడానికి చేతగాని ప్రభుత్వం.. అందాల పోటీలు పెడుతుందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో సబ్బండ వర్గాలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్నా రోడ్లు వేయలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత కృషితో ఆలేరు నుంచి గుండాల మీదుగా మోత్కూరు వరకు రూ.42కోట్లతో డబుల్ రోడ్డు వేశారన్నారు. జీడికల్ గ్రామం వద్ద 2 కిలోమీటర్లు జనగామ జిల్లా పరిధిలో ఉండటంతో అక్కడ రోడ్డు వేసే అవకాశం లేదని తెలిపారు. ఆ రోడ్డు వేయాలని నాడు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి విన్నవించినా వేయలేదన్నారు.
ప్రస్తుతం ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్నా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు భూ దందాలపై ఉన్న మక్కువ అభివృద్ధిపై లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పురుగుల మత్స్యగిరి, కూనగళ్ల గణేశ్, కందుకూరి చందు, ఆకుల సాంబయ్య, జెనిగల మధు పాల్గొన్నారు.