హుజూర్నగర్, ఆగస్టు 19 : రాష్ట్ర స్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భార్గవ చారి సత్తాచాటాడు. ఆగస్టు 15, 16 తేదీల్లో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో భార్గవ చారి బంగారు పతకం, 400 మీటర్ల ఫ్రీైస్టెల్లో రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా భార్గవ చారి అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ విజయానికి తన గురువు పులి మధు ప్రోత్సాహం ఎంతగానో దోహదపడిందని భార్గవ చారి తెలిపారు.