హాలియా, జూన్ 23 : హాలియా మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం ఒక్కోటి నాలుగు లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన నాలుగు ఆటోలు మూలకుపడ్డాయి. ఆటోలు చెడిపోవడంతో మళ్లీ మరమ్మతులు చేయించలేదు.
వేల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ ఆటోలు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పాత సామగ్రికి వేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.