నల్లగొండ కల్చరల్(రామగిరి), మార్చి 4: శుభతిథుల నిర్ణయానికి ఉపయోగపడే పంచాంగాలను రూపొందించి బ్రాహ్మణ, అర్చకులకు, ప్రముఖులకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని తెలంగాణ బ్రాహ్మణ సమఖ్య రాష్ట్ర జేఏసీ చైర్మైన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. అధ్యక్షుడు, తెలంగాణ ధూప దీప నైవేద్య సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండకు చెందిన ప్రముఖ పురోహితులు పెన్నా మోహన శర్మ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ వితరణ కార్యక్రమం మంగళవారం నల్గొండలోని రాఖిల్స్ కాలనీలో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉమ్మడి నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా పెండ మోహన్ శర్మ పంచాంగాలను రూపొందించి ఉచితంగా అందజేయడం శుభపరిణామం అన్నారు. అయితే హిందూ ధర్మ సంప్రదాయంలో పంచాంగానికి ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు ఏ శుభ ముహూర్తం కానీ శుభకార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు తిథి ఘడియ శుభ ముహూర్తం నిర్ణయించుకుంటారని తెలిపారు.
హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా…
బ్రాహ్మణ అర్చకులు అందరూ గత 20 సంవత్సరాలుగా పంచాంగాల రూపొందించి ఆవిష్కరణ అనంతరం ఉచితంగా పంపిణీ చేస్తున్నానని తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ తెలిపారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 మంది బ్రాహ్మణ అర్చకులు హాజరై పంచాంగాలను స్వీకరించారు. అనంతరం పంచాంగ రూపొందించడంలో సహకరించిన దాతలను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం ప్రతినిధులు సత్యనారాయణ శర్మ, కొండుచు నవీన్ కుమార్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన బ్రాహ్మణులు అర్షకులు పురోహితులు ప్రముఖులు పాల్గొన్నారు.