రామగిరి, ఏప్రిల్ 13: ప్రభుత్వ పాఠశాలలల్లో (జడ్సీ, ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు)లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి టీజీ పాలీసెట్, టీజీఆర్‌జేసీలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సీహెచ్.సుధాకర్ రెడ్డి, అధ్యక్షుడు డి.రాములు తెలిపారు. నల్లగొండలోని కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 18 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ అందిస్తుండటంతో వందలాది మంది విద్యార్థులు ఉత్తమ కోర్సులు పూర్తిచేసి వివిధ రంగాలతో పాటు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు.
ప్రస్తుతం అందించే శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు వారి పదో తరగతి హాల్ టికెట్ తీసుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణలో చేరవచ్చన్నారు. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ వీటీ కాలనీలోని కాకాతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలలో 12 మే, 2026 వరకు ఉచితంగా అందజేసే శిక్షణకు అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.నరిసింహ్మరెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడంతో విద్యార్థులు భవిష్యత్‌లో త్వరగా స్థిరపడవచ్చని తెలిపారు. అంతేకాకుండా నేరుగా ఈసెట్ రాసి బీటెక్ లో సహితం చేరవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9666542153, 9491328432, 8142070502లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు దాడి భాస్కర్‌రెడ్డి, మురుసూరన్ తదితరులు పాల్గొన్నారు.