బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ను ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.