రాజాపేట, ఏప్రిల్ 18 : వరంగల్ ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే 25 వసంతాల వేడుకకు బీఆర్ఎస్ శ్రేణులు జాతరల తరలిరావాలని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని చెల్మెడి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రజతోత్సవ సభకు కాంగ్రెస్ నాయకుల గుండెలు అదిరేలా భారీగా తరలిరావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గడప గడప వివరిస్తూ సభకు జన సమీకరణ చేయాలని కోరారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టి గొంతులో నొక్కుతున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, నాయకులు పందిలా భాస్కర్ గౌడ్ ,కృష్ణ ఠాగూర్, ధర్మేందర్ సింగ్, కోరుకొప్పుల వెంకటేష్ గౌడ్, రెడ్డబోయిన రాజు, చెరువు కనకయ్య, నాగరాజు, భగత్ సింగ్, ఉప్పలయ్య, లక్ష్మణ్ నాయక్, భోగ హరినాథ్, తదితరులు పాల్గొన్నారు.