భువనగిరి అర్బన్, జూన్ 3 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సోమవారం జాతీయ జెండా, గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ ఉద్యమ రథసారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏండ్ల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బంగారు తెలంగాణగా రూపుదిద్దారన్నారు.
మాయ మాటలు, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలైనా హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఉద్యమం అంటే ఏంటో తెలియని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, మండలాధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు పాల్గొన్నారు.