నిడమనూరు, జనవరి 9 : దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జయంతి మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద గల నోముల నర్సింహయ్య, దివంగత మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తి యాదవ్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు సాదం సంపత్ కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, కూరాకుల వెంకటేశ్వర్లు, బహునూతల నరేందర్, జఠావత్ రవినాయక్, మార్కెట్ వైస్ చైర్మన్లు మెరుగు రామలింగయ్య, ఆడెపు రామలింగం, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, పాల్గొన్నారు
హాలియా, పెద్దవూరు, తిరుమలగిరి(సాగర్) మండలకేంద్రాల్లో నోముల నర్సింహయ్య చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. పెద్దవూరులో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్ నాయకులు సైదులు యాదవ్, ముని పాల్గొన్నారు. హాలియాలో మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, హాలియా మార్కెట్ వైస్ చైర్మన్ ఆడేపు రామలింగయ్య, మాజీ ఎంపీపీ అనుముల ఏడుకొండల్ తిరుమలగిరి(సాగర్): కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, చవ్వా నాసర్‌రెడ్డి, నాయకులు జటావత్ రమేశ్‌నాయక్, పగడాల పెద్దిరాజు పాల్గొన్నారు.