నిడమనూరు, జూన్ 25 : నిడమనూరు మండల పరిధిలోని బంటువారిగూడెం మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన భిక్షం కుటుంబాన్ని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బుధవారం పరామర్శించారు. భిక్షం తండ్రి వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని బంటువారిగూడెంలోని ఆయన నివాసానికి వెళ్లి వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, బీఆర్ఎస్ నాయకులు పిట్టల రమేశ్, బైరబోయిన నాగయ్య, పరుశురామ్, జానయ్య, కొండల్, జీడయ్య, బాలయ్య, నరేందర్, పరమేశ్, లక్ష్మయ్య, సైదులు, వెంకన్న పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్) : మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు షేక్ జావిద్ తల్లి ఇటీవల మృతి చెందారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ బుధవారం వారి నివాసానికి వెళ్లి జావిద్‌ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, మాజీ ఎంపీటీసీ రవి, మండల ఉపాధ్యక్షుడు జానకిరాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్, అన్వర్, నాగరాజు, కృష్ణయ్య, మహేశ్, చంటి, స్వామి, వంశీ, సతీశ్ పాల్గొన్నారు.