నల్గొండ రూరల్, ఆగస్టు 16 : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శనివారం ఆస్పత్రికి వెళ్లి సధాకర్ను పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులను సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. ఆయన త్వరగా కోలుకుంటారని, పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.