రాజాపేట, జూన్ 26: కాంగ్రెస్ సరార్ 18 నెలల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకోరని, రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో, ఆదాయం ఎలా పెంచుకోవాలో సోయి లేకుండా ఎప్పుడు కేటీఆర్, కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు.
బీఆర్ఎస్ నాయకులపై కక్షతో కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలని ప్రణాళికలే రూపొందిస్తున్నాడు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. సాగు జలాలపై చర్చ పెడుతా.. కేసీఆర్‌ను దమ్ముంటే సమావేశానికి రండి అని రేవంత్‌రెడ్డి పిలుస్తున్నావు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దమ్మున్న నాయకుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ ద్రోహి, ఓటు నోటు కేసులో జైలుకెళ్లిన అతడు రాష్ట్రానికి సీఎంగా ఉండే అర్హత లేదన్నారు.
సాగు జలాలపై పూర్తిగా అవగాహన లేని నీకు చిత్తశుద్ధి ఉంటే సచివాలయంలో అఖిలపక్ష సమావేశం పెట్టు హరీశ్‌రావు వచ్చి సాగు జలాలు ఎలా వాడుకోవాలో పూర్తిగా అవగాహన కల్పిస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగిందని మాట్లాడడానికి రేవంత్‌రెడ్డికి బుద్ధి ఉండాలన్నారు. కాంగ్రెస్ నాయకులకు సాం లు చేయడం అలవాటే అని ఆరోపించారు.
మాజీ సీఎం కేసీఆర్ అపర భగీరధుడిలా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కాగ్ నివేదికలో అన్ని విధాలా నాణ్యతతో స్పష్టంగా నిర్మాణం చేపట్టారని కితాబు ఇస్తే, రూ.90 వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో అవగాహన లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడ డం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
బనకచర్లపై పూర్తి గా అవగాహననే లేదని, రాష్ట్రానికి సాగు జలాల వాటా ఎంతో తెలియని అజ్ఞాని అని అన్నారు. సాగు జలాలపై అవగాహన పెంచుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, చింతలపూరి వెంకటరామిరెడ్డి, గుంటి మధుసూదన్‌రెడ్డి, రామిండ్ల నరేందర్, కటకం స్వామి, మో తుపల్లి బాలకృష్ణ, న ర్సింగరావు, సురేశ్ ఉన్నారు.