తుంగతుర్తి : సూర్యపేట మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం అమ్మమ్మ జటంగి నరసమ్మ (Jatangi Narasamma) ఇటీవల మరణించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ( Gadari Kishore ) నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ( Tribute) .
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, మాజీ రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్.కే రజాక్, నాయకులు గుండాగానీ రాములుగౌడ్, తునికి సాయిలు, గుండాగానీ దుర్గయ్య, గాజుల యాదగిరి, అంగోతు నరేష్, లాకావత్ మాన్సింగ్, యాకు నాయక్, గోపగాని శ్రీనివాస్, బొంకూరి మల్లేష్, కొండగడుపుల వెంకటేష్, సింహాద్రి, కరుణాకర్, ఉప్పుల నాగమల్లు, గోపగాని వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.