నీలగిరి, మే 16 : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో గురువారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు సార్లు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని, ఈ ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేసి పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించాలని సూచించారు.
ఈ గెలుపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు మారగోని గణేశ్, వట్టిపల్లి శ్రీనివాస్, నాయకులు నారబోయిన భిక్షం, కాంచనపల్లి రవీందర్రావు, కొండూరు సత్యనారాయణ, మామిడి పద్మ, సయ్యద్ జాఫర్, కందుల లక్ష్మయ్య, కృష్ణ, శంకర్, నాగేశ్వర్రావు, జయప్రదరెడ్డి, వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు.