నల్లగొండ, ఆగస్టు 25: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో సూర్యాపేట శాస న సభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి కంచర్లకు శుభాకాంక్షలు చెప్పారు.
ఆయనతో పాటు మాజీ జడ్పీచైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, నలమోతు భాస్కర్‌రావు, నోముల భగత్ కుమార్, హుజూర్నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్ కుమార్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక వీటీ కాలనీ నుంచి వివేకానంద విగ్రహం ద్వారా బీఆర్ఎస్ ఆఫీస్ వరకు కంచర్లతో కలిసి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.
కోలాట బృందాలు, గిరిజనుల నృత్యాలతో స్వాగతం..
కంచర్ల సోమవారం ఉదయం స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్లలో రామలింగేశ్వర్స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నల్లగొండకు రాగా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గిరిజనుల నృత్యాలు, కళాకారులు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికి పటాకులు పేల్చారు. అనంతరం కార్యకర్తలు బొకేలు, శాలువాలు కప్పి కంచర్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఇంత ప్రేమ చూపినందుకు అందరికీ కంచర్ల కృతజ్ఞతలు తెలిపారు.
రక్తదానం, పండ్లు పంపిణీ..
కార్యాలయంలో యువకులు రక్తదానం చేశారు. బొమ్మరబోయిన నా గార్జున ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్ల పంపిణీ చేయగా తిప్పర్తి, కనగల్, నల్లగొండల్లో సేవాకార్యక్రమాలతోపాటు కేక్ కటింగ్స్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, నిరంజన్ వలి, మాలె శరణ్యారెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కరీంపాష, మైనం శ్రీను, తుమ్మల లింగస్వామి, లొడండి గోవర్ధన్, బోనగిరి దేవేందర్, పల్ రెడ్డి రవిందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, వంగాల సహదేవ రెడ్డి, దోటి శ్రీనివాస్, రావుల శ్రీనివాస రెడ్డి, కందుల లక్ష్మయ్య, జమాల్ ఖాద్రీ, యాట జయప్రదారెడ్డి, వనపర్తి జ్యోతి, నాగేశ్వర్రావు, కోండ్ర స్వరూ ప, విమలమ్య, విజయ, గుండెబోయిన జంగయ్య పాల్గొన్నారు.