నిడమనూరు, జులై 03 : మహిళపై దాడి చేసిన కేసులో దోషులకు నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ కోర్టు జరిమానా విధించింది. కోర్టు లైజన్ అధికారి షేక్ అలీ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం జప్తివీరప్పగూడెం గ్రామానికి చెందిన గుడిపాటి లక్ష్మమ్మ 2016 సంవత్సరం ఆగస్టు 31న సాయంత్రం 4 గంటల సమయంలో బర్రెలకు మేత కోసం తమ సొంత వ్యవసాయ భూమిలో చొప్ప కోస్తుంది. ఆ సమంయలో దాయాదులు గుడిపాటి నవీన్, గుడిపాటి వెంకమ్మ, గుడిపాటి సైదయ్య పాత కక్షలతో వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి ఆమెపై దాడి చేశారు.
అదేవిధంగా అడ్డు వచ్చిన లక్ష్మమ్మ భర్తపై దాడి చేసి గాయపరిచారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్ఐ యాలాద్రి నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు అభియోగపత్రం సమర్పించారు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి స్వప్నదోషులకు ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్షను అనుభవించాలని తీర్పు వెల్లడించారు.