మిర్యాలగూడ, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హెచ్సీయూకు వెళ్తున్న ఆయా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మిర్యాలగూడలో..
మిర్యాలగూడకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకులను వన్‌టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదానాయక్, నాయకులు రఘు, ఆనంద్, రవి, జగన్, న్యూమన్, బిస్మిల్లా ఉన్నారు.
నల్లగొండ సిటీ : పలువురు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను కనగల్ మండల పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో డీవైఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ మహ్మద్ అక్రమ్, ఎస్ఎఫ్ఐ కనగల్ మండల కార్యదర్శి హరిచందన్, నాయకులు బొంత నర్సింహ, మహ్మద్ సైహద్ ఉన్నారు.
నకిరేకల్ : సీపీఎం మండల కార్యదర్శి రాచకొండ వెంకట్‌గౌడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కట్టంగూర్ : హైదరాబాద్ సెంట్రల్ యూన్సివర్సిటీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం యూనివర్సిటీ ఎదుట జరిగే ధర్నాకు వెళ్తున్న సీపీఎం, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఐ డివిజన్ సెక్రటరీ ముసుగు రవీందర్, నాయకులు ముపుకు మారయ్య, పూదోటి నరహరి, ఎల్లయ్య, రమేశ్ ఉన్నారు.
నార్కట్‌పల్లి : సీపీఎం మండల కార్యదర్శి చింతపల్లి బయ్యన్నను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
శాలిగౌరారం : సీపీఎం మండల కార్యదర్శి చెలకాని మల్లయ్య, పాచరేలే కల్లూరి లింగయ్య, మక్క బుచ్చిరాములు, బట్ట రామచంద్రు, బల్లెం లక్ష్మయ్య, వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేతేపల్లి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ చినవెంకులు, పార్టీ నాయకులు చింతపల్లి లూర్ధుమారయ్య, వంగూరి వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
హాలియా : సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీనును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మర్రిగూడ : హెచ్సీయూకు వెళ్తున్న ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేశ్, సీపీఐ నాయకుడు కోన్‌రెడ్డి గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మునుగోడు : సీపీఎం నాయకులను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో నాయకులు సాగర్ల మల్లేశ్, మిర్యాల భరత్‌కుమార్, యాసరాని శ్రీను, రాజేశ్ ఉన్నారు.
వేములపల్లి : సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్ట సంపత్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు..
దామరచర్ల : హెచ్సీయూకు వెళ్తున్న సీపీఎం మండల కార్యదర్శి వినోద్‌నాయక్, సీఐటీయూ మండల కార్యదర్శి బైరం దయానంద్, నాయకుడు ఎస్. పాపానాయక్ను వాడపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తిప్పర్తి : సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో నాయకులు భీమగాని గణేశ్, పోకల శశిధర్ ఉన్నారు.
బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్
చందంపేట(దేవరకొండ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మంగళవారం హెచ్‌సీయూ వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ హెచ్‌సీయూ భూములను అమ్ముకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ పోరాడుతుందన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు పాత్లావత్ లక్ష్మణ్, నాయకులు పొట్ట మధు, ఎస్కే. జమీర్బాబా, రాకేశ్ పాల్గొన్నారు.