దేవరకొండ రూరల్, జూన్ 03 : దేవరకొండ బస్ స్టేషన్లో మహిళా స్వీపర్ నిజాయితీ చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లకు చెందిన సుబ్బారావు రూ.30 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను దేవరకొండ బస్ స్టేషన్లో పోగొట్టుకున్నాడు. బస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేసే ముత్తమ్మకు ఆ ఫోన్ దొరకగా డిపో అధికారులకు అందజేసింది. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు విచారణ జరిపి మంగళవారం బాధితుడికి డిపో కార్యాలయంలో మొబైల్ ఫోన్ అందజేశారు. నిజాయితీ చాటుకున్న స్వీపర్‌కు ఆర్టీసీ అధికారులు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ అధికారులకు, స్వీపర్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.