తుంగతుర్తి, ఏప్రిల్ 09 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరుపాలన్నారు.
ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లకి క్వింటాకు రూ.2,300 రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సొసైటీ వైస్ చైర్మన్ మోడేమ్ శ్రీలత, డైరెక్టర్ భిక్షంరెడ్డి, సీఈఓ వందనపు వెంకటేశ్వర్లు, జై భీమ్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర కుంచాల శ్రీనివాస్ రెడ్డి, అనుక్, ఏఈఓ సాయి సృజన పాల్గొన్నారు.