అర్వపల్లి, అక్టోబర్ 17 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం, రామన్నగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. అలాగే తిమ్మాపురంలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి, ఏఓ గణేశ్, ఏపీఎం రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుడిపెల్లి మధుకర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.