నల్లగొండ, జనవరి 2: సంప్రదాయ పంటలకు భిన్నంగా రైతులు పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని ఇన్చార్జి కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వ్యవసాయ, ఉద్యాన అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న పం టలను ప్రోత్సాహించాలని నాబార్డ్ , రైతు ఉత్పత్తి సంఘాలతో పంటల మారెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు వ్యవసాయ, ఉద్యాన, నాబార్డ్, అనుబంధ శాఖల అధికారులతో చర్చించి తగు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని రైతులకు ఉపాధితో పాటు లాభాలు గడించేలా వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సెరికల్చర్, ఫిషరీస్ శా ఖల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో అధికారులు జిల్లాలో సాగుతున్న పంటలు వివరాలను కలెక్టర్ కు వివరించారు.సమావేశంలో డీఏఓ శ్రవణ్ కుమార్, హార్టికల్చర్ జేడీ సంగీతలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్, మత్స్యశాఖ అధికారి వెంకయ్య పాల్గొన్నారు.
పథకాలఅమలులో నిర్దిష్ట లక్ష్యంతో ఏర్పాటు చేసుకోవాలి
గ్రామీణ ప్రాంతాల్లో పథకాల అమల్లో నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోని ముందుకు సాగాలని ఇన్చార్జి కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. మంగళవార కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పనపై దృష్టి సారించి, యూనిట్లను నెల కొల్పెలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ తిరుపతయ్య పాల్గొన్నారు.