హుజూర్నగర్ రూరల్, జూన్ 2 : రైతులకు అధిక దిగుబడులు వచ్చే విత్తనాలను అందించాలని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధిక అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్ అన్నారు. సోమవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యాలయంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు విత్తన శుద్ధి, విత్తనాల ఎంపిక ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం నల్లగొండ జిల్లా శాస్త్రవేత్త రాజా, మధు, శేఖర్, వ్యవసాయ సహాయ సంచాలకులు రమావత్ రవినాయక్, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల నరేందర్‌యాదవ్, రైతులు, అధికారులు పాల్గొన్నారు.