కోదాడ, జులై 10 : ప్రతి ఫొటోగ్రాఫర్ కుటుంబ భరోసా పథకంలో చేరి, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కూకుంట్ల లాలు అన్నారు. ప్రమాదంలో ఏవరైనా మరణించినా, గాయాలపాలైన వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో కుటుంబ భరోసా పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 138 మందికి ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో భాగంగానే ప్రమాదంలో గాయపడ్డ కోదాడ మండల ఫొటోగ్రాఫర్లు శ్యామల సైదులు, పులి సైదులు, రాజేశ్‌కు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బొమ్మల వెంకన్న, కుటుంబ భరోసా ఇన్చార్జి గొట్టం రవి, కోదాడ మండలాధ్యక్షుడు పిల్లుట్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి చేపూరి లక్ష్మణ్ బాబు, స్టూడియో సురేశ్, హుజూర్నగర్ మండలాధ్యక్షుడు హరివర్మ, స్టూడియో వీరబాబు, హమద్, నాగరాజు, సైదాచారి, విష్ణు, నరసింహారావు, వీరన్న, సైదా, రమేశ్, నాగరాజు, నరేశ్ పాల్గొన్నారు.