కట్టంగూర్, ఆగస్టు 26 : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ పెద్ద మృతి చెందినట్లయితే ప్రభుత్వం రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తుందన్నారు. పథకానికి అర్హత పొందాలంటే మృతిడి వయస్సు18 నుంచి 59 ఉండి, 12 ఏప్రిల్ 2017 తర్వాత మృతి చెంది ఉండాలన్నారు. మరణించిన వ్యక్తికి సంబందించిన మరణ దృవీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు పత్రం, రేషన్ కార్డు, ఆధార్ లింక్ చేసిన బ్యాంక్, పోస్టాపీసు ఖాతా పుస్తకం, పాస్ ఫొటోను జత చేసి 28వ తేదీ లోపు ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.