మునుగోడు, మే 31 : అధికారులందరూ కలిసి నకిలీ విత్తనాలను అరికట్టాలని ఎమ్మెల్సీ సత్యం అన్నారు. శనివారం మునుగోడులో వ్యవసాయ శాఖ అధికారులకు రైతుల సమస్యలను వివరిస్తూ ఆయన పలు సూచనలు చేశారు. రైతులకు నకిలి విత్తనాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. పంటలపై మందుల పిచికారి పట్ల సైతం అవగాహన కల్పించాలని సూచించారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైనందున రైతులకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు ఎమ్మెల్సీ సత్యంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ వేణుగోపాల్, మునుగోడు ఏఓ పద్మజ, చండూరు ఏఓ మల్లేశం, ఏఈఓలు పాల్గొన్నారు.