కలెక్టరేట్లో దొంగ ఉద్యోగాలు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఓ ఏజెన్సీ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో దండుకున్నది. ఏకంగా జిల్లాస్థాయి అధికారులు ఉండే కలెక్టరేట్లో ఓ ముగ్గురికి నకిలీ పోస్టింగ్‌లు ఇచ్చి వేతనాలు కూడా అందిస్తున్నది.
- ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాకం
- ఉద్యోగాల పేరిట నకిలీ ఉత్తర్వులు
- అమాయకులను మోసం చేసి రూ.30లక్షలకుపైనే వసూలు?
- కలెక్టరేట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో అధికారులు
సూర్యాపేట, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఓ ఏజెన్సీ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో దండుకున్నది. ఏకంగా జిల్లాస్థాయి అధికారులు ఉండే కలెక్టరేట్లో ఓ ముగ్గురికి నకిలీ పోస్టింగ్‌లు ఇచ్చి వేతనాలు కూడా అందిస్తున్నది. వారిని ఎరగా చూసి మరో పాతిక మందికి దగ్గరి నుంచి పెద్దమొత్తంలో సొమ్ము కాజేసింది. డబ్బు తీసుకున్న వ్యక్తి ఎంతకీ ఉద్యోగాలు చూపించకపోడంతో బాధితులు నిలదీయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా కలెక్టరేట్లో ఫేక్ జాయినింగ్ ఆర్డర్‌తో మూడు నెలలుగా పని చేస్తున్న వారిని గుర్తించిన వారే లేకపోవడం విడ్డూరం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట కలెక్టరేట్లో పారిశుధ్య పనుల కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మణికంఠ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆరు నెలల కిందట నెలల కిందట ముగ్గురిని విధుల్లోకి తీసుకున్నారు. ఆ ముగ్గురికి నెల నెలా 5వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలు వేతనం ఇస్తూ ఐదు నెలల తరువాత 22 వేలు వస్తాయని నమ్మించారు. ఆ ముగ్గురికి అటెండెన్స్ తీసుకునేందుకు మరో యువతిని నియమించి ఆమెకు నెలనెలా 18 వేల చొప్పున వేతనం ఇస్తూ విషయం బయటకు తెలియకుండా మేనేజ్ చేశారు. ఇలా మొత్తం నలుగురికి వేతనాలు ఇస్తూ వారి ద్వారా తెలిసిన వారిని శానిటేషన్ ఉద్యోగాల్లో చేర్చుకుంటామని చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు దాదాపు 25 మంది నుంచి వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు.
కొద్దిమందికి పారిశుధ్య పనులు చేసేందుకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం గమనార్హం. ఇంకొందరికి వారంలో.. పది రోజుల్లో ఇస్తామంటూ రోజూ తిప్పించుకుంటున్నారు. ఇలా నెలలు గడుస్తుండడంతో తమకు ఉద్యోగాలైనా ఇవ్వండి లేదంటే తమ డబ్బులైనా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో గల ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలిస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకున్న ఏజెన్సీ నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగడం… విషయం మీడియా, పోలీసులకు తెలియడంతో శంకర్ అనే వ్యక్తితోపాటు బాధితులను పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. బాధితుల వద్ద ఉన్న ఒక ఉద్యోగ నియామక పత్రం సరైనదా, కాదా అని జిల్లా ఉపాధి కల్పన అధికారి అక్బర్ హబీబ్‌ను వివరణ కోరగా అది ఫేక్ అని తేల్చారు. ఇప్పటికే కలెక్టరేట్లో తాగునీరు లేక, బాత్రూముల్లో నీళ్లు అందుబాటులో లేక అనేక సార్లు ఉన్నతాధికారులకు లేఖలు సమర్పించినా ఫలితం లేకపోవడం, ఇప్పుడు కలెక్టరేట్లోనే ముగ్గురు ఔట్సోర్సింగ్ పేరిట విధులు నిర్వహించినా కనీసం గుర్తించలేని పరిస్థితి నెలకొనడం పట్ల సమీకృత కలెక్టరేట్ నిర్వహణ ఎంత అధ్వానంగా తయారైందో తేటతెల్లం చేస్తున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

