రామగిరి, జూన్ 7 : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించే గ్రూప్-1 పిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 16,899 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయగా రెండు రీజినల్ సెంటర్స్‌గా పరీక్ష కేంద్రాలను విభజించారు. రీజినల్ సెంటర్‌కు కో ఆర్డినేటర్‌గా నల్లగొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, రీజినల్ సెంటర్-1కు కో ఆర్డినేటర్‌గా ఎన్జీ కళాశాల పరీక్ష నియంత్రణాధికారి బి.నాగరాజు వ్యవహరించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి కలెక్టరేట్లో ప్రత్యేక కమాండెంట్ రూమ్‌లో పర్యవేక్షించనున్నారు. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగనుండగా ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. పరీక్ష సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచనున్నారు. ఆర్టీసీ ద్వారా అవసరమైన బస్సులను నడపనున్నారు.
అభ్యర్థులను ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు.
పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఉంటుంది.
ఇంకా హాల్ టికెట్లు రాని అభ్యర్థులు http://www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు షూస్ కాకుండా చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి.
పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్లకూడదు.
పరీక్ష కేంద్రం వదిలి వెళ్లే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌ను అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్ ప్రారంభమవుతుంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా
మెట్రిక్ ఇవ్వాలి. ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్లే ముందు కూడా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ వేయని అభ్యర్థుల మూల్యాంకనం చేయడం జరుగదు. పరీక్ష రాసే అభ్యర్థులు మెహెందీ వేసుకోవద్దు.