కోదాడ, ఆగస్టు 13 : డ్రగ్స్ నివారణలో అందరూ భాగస్వాములు కావాలని కే.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడ ప్రిన్సిపాల్ రమణారెడ్డి అన్నారు. బుధవారం ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధంపై అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకూడదన్నారు. అలా అయినట్లయితే దేశ భవిష్యత్, సమాజ భవిష్యత్, కుటుంబ భవిష్యత్, వ్యక్తిగత భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు.
ముఖ్యంగా మత్తు పదార్థాలు, వివిధ రకాల మాదక ద్రవ్యాలు ఉపయోగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వీటిని రవాణా చేసే వారిని, సహకరించే వారిని శిక్షిస్తుందని, అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండి యువత బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు, జి.యాదగిరి, వి.బల భీమారావు, ఆర్.రమేశ్, పి.రాజేశ్, ఎం.రత్నకుమారి, బి.రమేశ్ బాబు, జి.వెంకన్న, కె.రామరాజు, జి.రవి కిరణ్ , కె.సతీశ్, ఎస్.గోపికృష్ణ, ఎస్.కే.ఆరిఫ్, కె.శాంతయ్య, ఎన్.జ్యోతిలక్ష్మి, ఆర్.చంద్రశేఖర్, టి.మమత. డి.ఎస్.రావు పాల్గొన్నారు.