పెన్‌పహాడ్, ఆగస్టు 19 : ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి విషయాన్ని రికార్డ్స్‌లో నమోదు చేయాలని సూర్యాపేట ఎస్పీ కె.నర్సింహా పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కవాతు సిబ్బందిలో సమన్వయం పరిశీలించారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరు, కేసుల పురోగతి వివరాలను ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రౌడీ షిటర్స్, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్, తనిఖీలు నిరంతరం చేయాలన్నారు. పెండింగ్ ఉండకుండా ప్రణాళిక ప్రకారం పని చేయాలన్నారు. మహిళా కేసుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకంగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలను విస్తృతం చేయాలని, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సామాజిక కార్యక్రమాలు, అక్రమ రవాణా, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ గోపికృష్ణ. డీసీఆర్బీ ఎస్ఐ యాకుబ్, సీసీ సందీప్. డీ.సీ.ఆర్.బీ సిబ్బంది అంజన్ రెడ్డి ఉన్నారు.
Penpahad : ప్రతి విషయాన్ని రికార్డ్స్‌లో నమోదు చేయాలి : ఎస్పీ నరింహా