మునుగోడు, ఏప్రిల్ 22 : పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించేలా చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమణి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ పేరుతో ఏప్రిల్ 8 నుండి 22 వరకు పోషణ పక్షం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ప్రతిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు అన్న ప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ప్రతి గర్భిణీ అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం నర్సిరెడ్డి, ఉపాధ్యాయురాలు ఆయుష్, అంగన్ంవాడీ టీచర్లు మంగమ్మ, మంజుల, ఆశా కార్యకర్త లింగమ్మ పాల్గొన్నారు.
Munugode : పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించేలా చూడాలి : ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమణి