75th Republic Celebrations | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎపిటోమ్ ఎండీ జైపాల్ కాంత జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత దేశ భక్తితో మెలగాల్సిన అవసరం ఉందని తెలిపాడు. యువశక్తినీ ఉపయోగించుకుంటే సాధించలేనిది లేదని.. ప్రపంచంలో ఎక్కడలేని మానవ వనరులు మన దేశంలోనే ఉన్నాయని.. వాటిని సమర్థంగా వినియోగించుకుంటే నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఎపిటోమ్ సంస్థ రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా ఎదుగుతుందని.. కోయిల గూడెం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎపిటోమ్ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో కోయిల గూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవిద్య, ఎపిటోమ్ సీఎఫ్ఓ ఐజాక్ జార్జ్, డిప్యూటీ సీఎఫ్ఓ దేవ్ జిత్ దాస్, లీగల్ హెడ్ జాన్ వెస్లీలు పాల్గొన్నారు.