అర్వపల్లి, ఏప్రిల్ 25 : ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీహెచ్సీ డాక్టర్ భూక్య నాగేశ్ అన్నారు. అంతర్జాతీయ మలేరియా డే సందర్భంగా శుక్రవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలేరియా జబ్బు హాని కలిగించే ఆడ అనాఫిలిస్ దోమలు ఇంటి పరిసరాల్లోని నీటి స్థావరాల్లో పెరిగి రాత్రి పూట కుట్టడం వల్ల వస్తుందని తెలిపారు. కావునా ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.
వారానికి ఒకసారి పూల కుండీలు, టైర్లు, వినియోగించని చిన్న చిన్న పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. భారత్‌ను మలేరియా రహిత దేశంగా చేసేందుకు అంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ మాలోతు బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, సునిత, కళమ్మ, వాణి, గౌతమి, సైదమ్మ, వీరయ్య, నాగరాణి, విజయశాంతి, గిరిజ, శ్వేత, శైలజ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.