తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా అవతరించింది. ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై శుక్రవారం సరిగ్గా 1.20 గంటలకు సంతకం చేశారు. దీంతో భారత రాజకీయ యవనికపై కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సీఎం కేసీఆర్ తెలంగాణను ఏ విధంగానైతే బాగుచేసి అభివృద్ధి చేశారో.. అదే విధంగా దేశాన్ని బాగు చేసేందుకు కదలడంపై విభిన్న వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్తో దేశ పురోభివృద్ధికి నాంది
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఏనిమిదేండ్లుగా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ వస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్తో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపగలడని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు బీఆర్ఎస్ తోడ్పడుతుందని భావిస్త్తున్నా. దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కడమే కాకుండా రైతును రాజును చేసి భారత్‌ను ప్రపంచానికి ఆహార పాత్రగా మారుస్తాడని యావత్ భారతావని కార్మిక, కర్షకలోకం విస్వసిస్తుంది. బీఆర్ఎస్తోనే దేశ పురోభివృద్ధికి నాంది పడనుంది.
– చింతపల్లి వెంకటయ్య, జూనియర్ లెక్చరర్
యుగ పురుషుడు కేసీఆర్
స్వరాష్ట్ర కలను సాకారం చేసిన యుగ పురుషుడు మన కేసీఆర్. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగలగే సత్తా ఉన్న నాయకుడు అనడంలో సందేహం లేదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు. కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతుందంటే(రైతుబంధును పీఎం కిసాన్‌గా) ఇంతకన్నా దూరదృష్టి ఉన్న నాయకుడు మరొకరుండరు. రాష్ట్రంలో అమలౌతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు అయితే మనదేశం ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలుస్తుందనడంలో సందేహం లేదు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచిపెట్టడంలో కేసీఆర్‌కు ఉన్నంత విజన్ మరి ఏ నాయకుడికి లేదు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్!
– మహంకాళి రాజేశ్, క్రిమినల్ లాయర్, మిర్యాలగూడ
ప్రజాస్వామిక విప్లవానికి శంఖారావం
చూస్తే బక్కపల్చనివాడే. అద్భుతమైన మేధా సంపత్తి కలవాడు. ఎంతటి శత్రువునైనా మట్టి కరిపించే వ్యూహాత్మక చతురుత. అద్భుత వాక్పటిమతో ప్రతిపక్షాల నోరు మూయించడంలో దిట్ట. ఎంతటివారినైనా నొప్పించక ఒప్పించే తత్వం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో అందెవేసిన చేయి సీఎం కేసీఆర్‌ది. తెలంగాణ తల్లి దాస్య విముక్తికై అవతరించిన కారణజన్ముడు. దిన దిన ప్రవర్థమానంగా జాతీయ రాజకీయ ప్రస్థానం భరతమాత కన్నీటిని తుడిచి మాతృదేశ రక్షణకై భారత రాష్ట్ర సమితిగా అవతరించిన వేళ దేశమంతా జయహో నినాదాలతో నీరాజనాలు పలుకుతున్నది. బీఆర్ఎస్ నూతన ప్రజాస్వామిక విప్లవానికి శంఖారావం.
– డాక్టర్ టంగుటూరి సైదులు, తెలుగు లెక్చరర్, ఎన్జీ కళాశాల
బీఆర్ఎస్ పార్టీతో నూతన శకం
టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్గా గుర్తింపు లభించడంతో భారత దేశ చరిత్రలో కొత్త శకం మొదలైంది. బీఆర్ఎస్ గుర్తింపు నేపథ్యంలో దేశ ప్రజలకు సంక్షేమ పథకాలను తెలంగాణ తరహాలో అమలు చేసే బృహత్తర బాధ్యత సీఎం కేసీఆర్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో అడుగులు వేయడం శుభసూచకం.
దేశంలోని ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి స్వేచ్ఛా, సమానత్వాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం చారిత్రక ఘట్టానికి తెరలేపింది. తెలంగాణ ప్రయోజనాల పట్ల కేంద్రం వివక్ష పూరిత విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ద్వారా దోహదం అవకాశం కలుగుతున్నందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే పాలన సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యం.
– షేక్ అబ్దుల్ హలీం, న్యాయవాది, నిడమనూరు
బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాం
సీఎం కేసీఆర్ స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నిన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రాంతానికే పరిమితం. కాగా నేడు దేశవ్యాప్తం. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై మంచి పట్టు ఉండటంతో ఆయన చక్కగా రాణించే అవకాశం ఉంది.
– ఎడారి నరేశ్, పంచాయతీరాజ్ నాల్గొవ తరగతి ఉద్యోగుల సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్‌తో దేశంలో మార్పు రాబోతుంది
బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మాకు కూడా కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నరు. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రారంభించారు. దేశ ప్రజలకు సేవ చేసేందుకు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామం. రైతు సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుండటంతో ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటరు. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలు విసిగిపోయారు. సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కానుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశం పురోగమించడం ఖాయం. దేశంలో మార్పు కోసం అవతరించిన బీఆర్ఎస్ వెంటే ప్రతిఒక్కరూ నడవాల్సిన అవసరం ఉంది.
– పందుల పాండుగౌడ్, ఖుదాభక్ష్‌పల్లి, మర్రిగూడ మండలం
కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి
దేశ వ్యాప్తంగా తెలంగాణ తరహలో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలి. తెలంగాణ లాంటి అభివృద్ధి అన్ని రాష్ర్టాలకు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అవసరం. దేశంలో బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగుల్చుతున్నది. భారత్ రాష్ట్ర సమితికి మద్ధతిచ్చి దేశంలో గుణాత్మకమైన మార్పునకు అందరూ సహకరించాలి. రాష్ట్ర రైతుల బాగు కోసం ఎన్నో విన్నూత పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. దేశ రైతులకు మరింత మేలు చేస్తారు. బీఆర్ఎస్ కోసం దేశ వ్యాప్తంగా రైతులు, రైతు నేతలు ఎదురు చూస్తున్నారు.
-బి.వెంకట్‌రెడ్డి రిటైర్డ్ హెల్త్ అసిస్టెంట్
బీఆర్ఎస్తో దేశ ప్రజలకు మేలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీతో దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ ప్రాంతం గతంలో వివక్షతకు గురైంది. దీంతో కేసీఆర్ టీఆర్ఎస్ను ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి తెలంగాణ ప్రజానీకం ఆనందంగా ఉండేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కింది. దీంతో దేశ ప్రజలు కూడా తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ అభివృద్ధిని యావత్ దేశం హర్షిస్తుంది. మాకు కూడా అలాంటి సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధాన పాత్ర పోషించడం ఖాయం.
– గుండా సత్యనారాయణ, తిప్పర్తి
బీఆర్ఎస్ ఏర్పాటు చారిత్రక అవసరం
దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చారిత్రక అవసరం. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు విఫలం చెందాయి. ఈ దశంలో దేశ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం. దేశ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా.
– జవ్వాజి వెంకటేశం, మాజీ ఎంఈఓ, హాలియా